జాదవ్‌ రాజీనామాకు ఆమోదం లభిస్తుందా?

జాదవ్‌ రాజీనామాకు ఆమోదం లభిస్తుందా?

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న దశలో  కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కలబురగి జిల్లా చించోళి విధాన సభ సభ్యుడు ఉమేశ్‌ జాధవ్‌ సోమవారం పదవికి, పార్టీ స్వభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలోనే కాషాయ తీర్థాన్ని పుచ్చుకోన్నుట్లు తెలిసింది. వచ్చే  లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌కు కలబురిగి నియోజకవర్గం  భాజపా అభ్యర్థిగా పోటీ చేయవనున్నారు. ప్రధాని నరేంద్ర  మోదీ వచ్చే బుధవారం కలబురిగి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అప్పుడు జాదవ్‌ లాంఛనంగా కమలనాధుల్లో చేరనున్నారు. కలబురగి జిల్లాల్లో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత , లోక్‌సభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖేర్గ అణచి వేతను సహించలేకే జాదవ్ భాజపాలో చేరుతున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

రాజీనామాకు ఆమోదం లభిస్తుందా?

ఎప్పటి నుంచో ఆయన భాజపా పంచన చేరుతురని వార్తలు వచ్చాయి. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశలకూ గైరు హాజరయ్యారు. కాంగ్రెస్‌ నాయకత్వం ఆయనకు వ్యతిరేకంగా ఫిరాయింపు నిషేధ చట్టం కింద ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే అస్త్రాన్ని ప్రయోగిం చింది.  ఆ మేరకు విధాన సభాపతి రమేశ్‌ కుమార్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా చేసింది. అనారోగ్యం వల్ల చట్టసభ సమావేశాలకు హాజరు కాలేక పోయినట్లు జాదవ్‌ వివరించారు. తదుపరి చర్యను రమేశ కుమార్‌ వాయిదా వేసారు. ఈ దశలో   పార్టీకి, దిగువ సభ సభ్యత్వానికి జాదవ్‌ రాజీనామా చేసారు. దీనిపై రమేశ కుమార్‌ నిర్ణయాన్ని బట్టి జాదవ్‌ రాజకీయ భవిత ఆధారపడి ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos