అమరావతి: జబర్దస్త్ నటుడు హరికి వ్యతిరేకంగా ఎర్ర చందనం దొంగ రవాణాలో పోలీసులు కేసు దాఖలు చేసారు. గతంలోనూ ఈయన స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎనిమిది మంది ఎర్ర చందనం దొంగ రవాణాదార్లను అటవీ శాఖ అధికార్లు పట్టు కున్నారు. వారి నుంచి రెండు నాటు తుపాకులు, దీంతో పాటు రూ. 3 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ‘ఈ స్మగ్లింగ్ గ్యాంగుతో హరికి సంబంధాలు ఉన్నాయి. గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడ’ ని పోలీసులు ఆరోపణ. దీన్ని హరి ఖండించారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నపుడు పోలీసులకు సమాచారం అందించినందకు ఆగ్రహించి తన పై తప్పుడు కేసులు పెట్టారని హరి ప్రత్యారోపణ చేసారు.