అమరావతి: అమరావతి భూముల విలువ రూ. రెండు లక్షల కోట్లు ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన అంచనా అవాస్తవమని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్జ కృష్ణారావు మంగళవారం ట్వీట్లో ఖండించారు. రూ.రెండు లక్షల కోట్లు అనేది కేవలం ఊహాజనితమైన విలువగా కొట్టి పారేసారు. వాస్తవ విలువ లెక్కగట్టేందుకు ఒక వేయి ఎకరాల్ని అమ్మకానికి పెడితే నిజం తేలుతుందన్నారు. ఊహాజనిత విలువలతో కట్టే గాలిమేడలు కూలిపోతాయని చెప్పారు. ‘ ప్రపంచబ్యాంకు నుంచి వచ్చేది రుణమే తప్ప ఉచిత సాయం కాదు. ఈ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉంది. ఏదో కోల్పోయామనే బాధ అవసరం లేదన్నారు.