ప్రచారవేదికపై ఓవైసీ స్టెప్పులు..

వాగ్ధాటితో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడంలో,ప్రసంగాలతో ప్రజల మనసులను మంత్రముగ్ధులను చేయడంలో దిట్ట అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రొటీన్కు భిన్నంగా ప్రచార వేదికపై స్టెప్పులేసి హుషారెక్కించారు.మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 44 నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయనున్నారు.దీంతో అభ్యర్థుల తరపున ప్రచారాల బాట పట్టిన ఓవైసీ అందులో భాగంగా ఔరంగాబాద్లోని పైథాన్గేట్ వద్ద జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం స్టేజీ దిగుతూ స్టెప్స్ వేశారు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామం కార్యకర్తల్లో ఫుల్జోష్ నింపింది.అంతకుముందు జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీపై అసదుద్దీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల సమయంలోనే ఆయనకు వివాదాస్పద అంశాలు గుర్తుకు వస్తాయి. వీటిని లేవనెత్తి మతవాదులు, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులకు సంకేతాలు ఇస్తారు. ఇంగ్లీష్లో దీన్ని ‘డాగ్ విజిల్ పాలిటిక్స్’ అంటారు’ అని విరుచుకుపడ్డారు. 1993 బాంబు పేలుడు నిందితులందరికీ శిక్ష పడిందని, యాకూబ్ను ఉరితీశామని ప్రధాని చెబుతారని, కానీ శ్రీకృష్ణ కమిషన్ నివేదిక సూచించినట్లు బాధితులకు న్యాయం చేసేందుకు మాత్రం ఆలోచించరని ఎద్దేవా చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos