ఆరుగురు జవాన్ల మంచు సమాధి

ఆరుగురు జవాన్ల మంచు సమాధి

కిన్నౌర్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లో బుధవారం మంచు చరియలు విరిగి పడటంతో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసుకు చెందిన ఆరుగురు జవాన్లు మృతి చెందారు. కిన్నౌర్‌ జిల్లాలోని నంగ్య రీజియన్‌ ప్రాంతంలో మంచు చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో ఐటీబీపీ, స్థానిక జిల్లా పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడటంతో జవాన్లు దాని కింద కూరుకుపోయారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు జవాన్లు మంచు కింద చిక్కుకున్నారు. ఒక జవాను మృత దేహాన్ని వెలికితీశారు. మిగతా వారిని వెలికి తీసే చర్యలు చేపట్టినట్లు కిన్నౌర్‌ డిప్యూటీ కమిషనర్‌ గోపాల్‌ చంద్‌ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos