హైదరాబాద్: దినసరి కూలీకి రూ. కోటి కట్టాలని ఆదాయపు పన్ను శాఖ తాఖీదు జారీ చేసి ఆశ్చర్య పరచింది. హైదరాబాద్కు చెందిన బావుసాహెబ్ అహీర్ బతుకు తెరువు కోసం కొన్నేళ్ళ కిందట ముంబై వెళ్ళాడు. రోజు వారీ సంపాదన రూ.500. తాఖీ దును మొదట పట్టించుకోని అహీర్ కొన్నాళ్ళకు దాన్ని మరచిపోయాడు. మళ్లీ అదే తాఖీదు రావటంతో భీతిల్లాడు. ఏమి చే యా లో పాలుపోక పోలీసుల్ని ఆశ్రయించాడు. పెద్ద నోట్ల రద్దయినపుడు అహిర్ బ్యాంకు ఖాతాలో రూ. 58 లక్షలు ధరావత్తు చేసాడని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్పారు.అయితే తనకు బ్యాంకు ఖాతానే లేదనేది అహిర్ వాదన. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.