తెలుగు చిత్ర పరిశ్రమల్లో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో గీత ఆర్ట్స్ ఒకటి.గీత ఆర్ట్స్‌పై పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన అల్లు అరవింద కొద్ది కాలం క్రితం గీత ఆర్ట్స్2 పేరుతో మరొక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి చిన్న,మీడియం బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ కోవలోనే గత ఏడాది విజయ్‌దేవర కొండ,రష్మిక మందన్నలతో గీతగోవిందం తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.తాజాగా గీత ఆర్ట్స్2 కార్యాయలంలో గురువారం రాత్రి ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. గీతగోవిందం చిత్రానికి దక్కిన వసూళ్ల గురించి లెక్కలు తేల్చడానికి ఐటీ అధికారులు గీత ఆర్ట్స్2 కార్యాలయంలో దాడులు చేసినట్లు సమాచారం.ఈ చిత్రం దాదాపుగా రూ.130 కోట్ల వరకు వసూళ్లు సాధించడంతో అంతమేర పన్నులు కట్టారో లేదో తెలుసుకోవడానికి దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఒకే సంవత్సరంలో ఒకే బ్యానర్ నుంచి గీతగోవిందం,టాక్సీవాలా చిత్రాలు రావడం అవి రెండు పెద్ద హిట్‌లుగా నిలిచి వసూళ్ల సాధించిన నేపథ్యంలో ప్రతీ ఆర్థిక సంవత్సరం నిర్వహించిన తరహాలనే ఐటీ అధికారులు దాడులు చేసి ఉంటారని సమాచారం.ఈ దాడులకు సంబంధించిన విషయం బైటకు పొక్కిన వెంటనే టాలీవుడ్ లో ఇతర ప్రొడ్యూసర్లు.. డిస్ట్రిబ్యూటర్లు జాగ్రత్తపడ్డారట.అయితే గీత ఆర్ట్స్2 కార్యాలయంలో ఐటీ అధికారుల దాడుల గురించి అటు ఐటీ అధికారులు కానీ ఇటు గీత ఆర్ట్స్ వర్గాలు కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు..