న్యూఢిల్లీ : నూతన ఐటి చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం పొలిట్బ్యూరో డిమాండు చేసింది. ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజికమాధ్యమాల ఈ చర్య తీసుకుంది. దీని వల్ల వినియోగదారుల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందని, నేర గాల్లు ళ్లు వీటిని హ్యాక్ చేసే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు పేర్కొన్నారు. ఫేస్బుక్ లో వ్యాఖ్యలు, పరిశీలనకు అనుగుణంగా బిజినెస్ అప్లికేషన్స్లో వాట్సాప్ భద్రతను బలహీనపరిచే అంశాన్ని సమీక్షించి, ఉపసంహరించాలి. భారతదేశంలో వాట్పాస్ డేటాను ఫేస్బుక్ పొందాల నుకుంటుంది.ఐరోపాలో ఇలాంటి సౌలభ్యాన్ని కల్పించలేదు. పలువురు బిజెపి నేతలు చేసిన ట్వీట్లు మీడియాలో అవకతవకగా చూపించారంటూ ట్విట్టర్ను బెదిరించేందుకు కేంద్రం ఢిల్లీ పోలీసులను ఉపయోగిస్తోంది. ఐటి మంత్రిత్వ శాఖను పక్షపాత రీతిలో బిజెపి ప్రభుత్వం ఉపయోగించడాన్ని సిపిఎం ఖండిస్తోంది. ట్విట్టర్ కార్యాలయాలపై పోలీసుల దాడులను తీవ్రమైన బెదిరింపు చర్యలుగా పేర్కొంది. ప్రజలు పంపే సందేశాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చేందుకు గాను భద్రతాపరమైన ప్రొటోకాల్స్ను దెబ్బతీయడం చాలా ప్రమాదకరమైన, తిరోగమనంతో కూడిన చర్య అని సిపిఎం పొలిట్బ్యూరో పేర్కొంది. ఈచర్యలు పౌరుల గోప్యతా హక్కును ఉల్లంఘిస్తూ ప్రభుత్వ నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తాయని పేర్కొంది. తక్షణమే ఈ నిబంధనలన్నింటినీ ఉపసంహరించాలని సిపిఎం డిమాండ్ చేసింది.