మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

వరుస విజయాలతో దూసుకుపోతూ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత పతాకాన్ని రెపరెపలాడించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)మరో ప్రయోగానికి సిద్ధమైంది. నెల 25 పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. దీని ద్వారా కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. నెల 25 ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ-47 నింగికెగియనుంది.కార్టోశాట్-3ని 509 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ఇస్రో ప్రవేశపెట్టనుంది. హై రెజొల్యూషన్ ఇమేజింగ్ క్యాపబిలిటీ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను శాటిలైట్ తీస్తుంది. మరోవైపు, ఇతర 13 నానో శాటిలైట్లు అమెరికాకు చెందినవి కావడం గమనార్హం.కొద్ది రోజుల క్రితం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 2 విఫలం కావడంతో పీఎస్‌ఎల్‌వీ సీ-47 రాకెట్‌ ప్రయోగంపై సర్వత్రా ఉత్కంఠ,ఆసక్తి నెలకొంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos