చెన్నై: ఇస్రో ప్రయోగాలకు ముందు చేపట్టే కౌంట్డౌన్ ప్రక్రియకు అంత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆ సమయంలో గంభీరమైన స్వరం వినిపించే ఓ ఉద్యోగిని- వలర్మతి (50) గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చంద్రయాన్-3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె చివరి సారిగా చంద్రయాన్-3కి తన స్వరం వినిపించారు.