న్యూ ఢిల్లీ: శ్రీహరికోట లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం-షార్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తులు షార్లో బాంబు ఉన్నట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు షార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. మరోవైపు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి గురించి ఆరా తీయగా.. ఇది ఆకతాయి పని అని తేలింది. పోలీసులు కేసుదర్యాప్తు చేపట్టారు.