మంగళూరు : ఇక్కడి ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ప్రాణేశ్కు కవిత్వం పట్ల ఆసక్తి మెండు. లాక్డౌన్ కాలంలో రాసిన 21 అడుగుల ‘తుళునాద ఐసిరీ’ అనే కవితకు ఏకంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు లభించింది. 2,241 పదాలున్నాయి.దీని పొడవు కొలిస్తే 21 అడుగులు. మొత్తం 108 పేరాలు, 432 లైన్లు ఉన్నాయి. తుళు సంస్కృతి, సంప్రదాయాల్ని కవితలో ప్రతి ఫలించారు.