అమరావతి: దేశంలో, రాష్ట్రంలో గాంధేయ, గాడ్సే వాదాల మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ కార్యాధ్యక్షుడు తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహం, మోసం మరే పార్టీ చేయ లేదు.హోదాకు పంగనామం పెట్టారు. విభజన హామీలు అమలు చేయలేదు. దేశంలో, రాష్ట్రంలో గాంధేయ వాదానికి, గాడ్సే వాదానికి మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతోంది. అంతిమ విజయం గాంధేయవాదానిదేన’ని స్పష్టీకరించారు.‘శాసన మండలి రద్దు తీర్మానం వైఎస్ కు వెన్నుపోటు పొడవడమే.కక్ష పూరితంగా,అహంకారంతో మండలి రద్దు తీర్మానం చేశార’ని విమర్శించారు.