దేశంలో ఏపీ లేదా?

ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రారంభించిన దీక్ష‌కు మాజీ ప్ర‌దాని మ‌న్మోహ‌న్ సింగ్‌,కాంగ్రెస్ అధినేత రాహు ల్ గాంధీ, జ‌మ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు చేస్తున్న దీక్షా వేదిక వ‌చ్చి ఏపి ప్ర‌జ‌ల‌కు త‌మ మ‌ద్ద తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని మోదీ పై ఇద్ద‌రు నేత‌లు ఫైర్ అయ్యారు.

ఆ బాధ్య‌త కేంద్రానిదే..

ప్ర‌ధాని మోదీ ఏపి కి వెళ్లి అబ‌ద్దాలు చెబుతున్నార‌ని..ఆయ‌న ఏపి ప్ర‌జ‌ల‌ను మోసం చేసార‌ని కాంగ్రెస్ అధినేత రాహు ల్ గాంధీ ఆరోపించారు. దీక్షా స్థలికి చేరుకున్న ఆయన ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం చంద్రబాబును కలిసి దీక్షకు మద్దుతు తెలిపారు. కాప‌లాదారుడే దొంగ అంటూ మోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌ధాని ఇచ్చిన హామీని ప్ర‌ధాని అమ‌లు చేయరా అని ప్ర‌శ్నించారు. ఏపి భార‌తదేశంలో భాగం కాదా అని రాహుల్ నేరుగా ప్ర‌శ్నించారు. ఏపికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో తాము పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని రాహుల్ హామీ ఇచ్చారు. రాఫెల్ వ్య‌వ‌హారంలో మోదీ దొరికిన దొంగ అని వ్యాఖ్యానించారు. ఏపి ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం చేసే పోరాటాల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసారు. మోదీ ప్ర‌ధానిగా మ‌రో రెండు నెల‌లు మాత్ర‌మే ఉంటార‌ని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీని ఓడిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు.
నాడు విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ డిమాండ్ చేసారు. చంద్ర‌బాబు దీక్ష‌కు..ఏపి ప్ర‌జ‌ల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. నాడు విభ‌జ‌న టైం లో అంద‌కూ ఏక‌గ్రీవంగా ఏపికి హోదా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించార‌ని గుర్తు చేసారు. ప్ర‌భుత్వంలో ఎవ‌రు ఉన్నా ప్ర‌భుత్వంలో ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంలో ఉన్న‌వారి పై ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసారు. ఏపి ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తుగా తమ‌తో పాటుగా యావ‌త్ దేశం ఉంటుంద‌ని వెల్ల‌డించారు.
పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని జ‌మ్ము కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్డుల్లా పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు దీక్ష‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ఆయ‌న ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుందని.. అందుకే ఆంధ్రా ప్రజలు ఇక్కడికి వరకు వచ్చారన్నారు. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి పాలించాలని చూస్తున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలన్నారు. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదని హితవు పలికారు. ప్రధాని అన్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఫ‌రూక్ అబ్దుల్లా డిమాండ్ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos