ముంబై : నటుడు దివంగత ఇర్ఫాన్ చేసిన సేవలకు గుర్తుగా తమ ఊరి పేరును ఇర్ఫాన్‌గా మార్చాలని మహారాష్ట్రలోని ఇగాత్ పురి గ్రామస్తులు నిశ్చయించారు. ఎంతో కింది స్థాయి నుంచి వచ్చిన ఇర్ఫాన్ చాలా కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎప్పటికి గుర్తుంచుకునే నటుడిగా పేరు సంపాదించాడు. ఊరి పేరు మార్పుకు కారణమ ఏమంటే? ఇగాత్ పురి గ్రామంలో ఇర్ఫాన్ చాలా కాలం కిందట కొంత భూమి కొన్నాడు. అప్పుడు ఆ ఊరు ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదు. ఆ ఊరిలో గిరిజన విద్యార్థులకు తన వంతు సహాయం చేసాడు. పిల్లలకు పాఠ్య పుస్తకాలు, రెయిన్ కోట్స్, స్వెటర్లు, ఇతర నిత్యావసరాలు అందించాడు. వారి కుటుంబసభ్యులతో కలిసి పండుగలుచేసుకుని మిఠాయాల్ని పంచేవాడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన దగ్గరకు రావొచ్చని ఊరి వాళ్లకు హామీ ఇచ్చాడు. ఇర్ఫాన్ మరణంతో ఇగాత్ పురి గ్రామం మూగబోయింది. తమ ఇంటి మనిషినే కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. తమ గ్రామానికి ఎంతో సేవ చేసిన ఇర్ఫాన్‌కు గుర్తుగా తమ ఊరికి అతని పేరు పెట్టడమే సరైన నిర్ణయమని గ్రామస్తులు తీర్మానించారు.