ఖమేనీ హత్యకు ప్లాన్ చేశామన్న ఇజ్రాయెల్

ఖమేనీ హత్యకు ప్లాన్ చేశామన్న ఇజ్రాయెల్

టెల్‌ అవి వ్‌:ఇరాన్‌తో ఇటీవల జరిగిన 12 రోజుల యుద్ధ సమయంలో ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆపరేషన్‌కు సరైన అవకాశం లభించకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఛానల్ 13’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కాట్జ్ ఈ కీలక విషయాలు బయటపెట్టారు. “మేము ఖమేనీని అంతమొందించాలని అనుకున్నాం. కానీ అందుకు ఆపరేషనల్ అవకాశం చిక్కలేదు” అని ఆయన స్పష్టం చేశారు. తమ దాడికి భయపడి ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కాట్జ్ ఆరోపించారు. “తన ప్రాణానికి ముప్పు ఉందని గ్రహించిన ఖమేనీ, చాలా లోతైన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ తొలిదశ దాడుల్లో మరణించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ల స్థానంలో వచ్చిన వారితో కూడా ఆయన సంబంధాలు తెంచుకున్నారు” అని కాట్జ్ పేర్కొన్నారు. అయితే, యుద్ధ సమయంలో ఖమేనీ వీడియో సందేశాలు విడుదల చేసిన నేపథ్యంలో, ఆయన తన జనరల్స్‌తో సంబంధాలు కోల్పోయారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos