ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు

ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు

న్యూ ఢిల్లీ: టెహ్రాన్‌లోని  భారతీయ  పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం  ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్‌ ను వీడి అర్మేనియా కు క్షేమంగా చేరుకున్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో రేపు ఢిల్లీకి రానున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. టెహ్రాన్‌లోని భారతీయులందరూ సొంత మార్గాల్లో వీలైనంత త్వరగా నగరాన్ని వీడాలని కోరింది.  సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos