మాపై అణుదాడి జరిపితే… ఇజ్రాయెల్ పై పాకిస్థాన్ అణుబాంబులు వేస్తుంది

మాపై అణుదాడి జరిపితే… ఇజ్రాయెల్ పై పాకిస్థాన్ అణుబాంబులు వేస్తుంది

టెహరాన్‌ :ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఒకవేళ అణుదాడికి పాల్పడితే, పాకిస్థాన్ తక్షణమే రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై అణుబాంబుతో విరుచుకుపడుతుందని ఇరాన్‌కు చెందిన సీనియర్ సైనిక అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రభుత్వ ఆధీనంలోని ఒక టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) జనరల్ మొహసిన్ రెజాయి ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.”ఒకవేళ ఇజ్రాయెల్ మా దేశంపై అణుదాడికి తెగబడితే, ఇస్లామాబాద్ కూడా టెల్ అవీవ్‌పై అణుబాంబును ప్రయోగిస్తుందని పాకిస్థాన్ నుంచి మాకు స్పష్టమైన హామీ లభించింది” అని ఇరాన్ జాతీయ భద్రతా మండలిలో సభ్యుడు కూడా అయిన మొహసిన్ రెజాయి తెలిపారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా, తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్థాన్ వంటి దేశాలతో కలిసి ఒక సమష్టి ‘ఇస్లామిక్ ఆర్మీ’ని ఏర్పాటు చేయాలని కూడా మొహసిన్ రెజాయి ప్రతిపాదించారు. అయితే, ఇరాన్ యూనిఫామ్ ధరించడానికి ఆయా దేశాలు ప్రస్తుతం సుముఖంగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దేశాల్లో ఏ ఒక్కటైనా ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే, రాత్రికి రాత్రే ఈ ప్రాంతంలో బలాబలాలు పూర్తిగా మారిపోతాయని ఆయన పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos