ముంబై : ఈ ఐపీఎల్ సీజన్‌కు గాను గ్రూపు దశ వరకు మ్యాచుల షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది. మే 5న గ్రూపు దశ ఆఖరి మ్యాచ్ ఉంటుంది. ఈ నెల 23న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొనబోతోంది. గ్రూపు దశలో మ్యాచులు సాయంత్రం నాలుగు గంటల నుంచి, రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతాయి. గ్రూపు దశలో ప్రతి జట్టూ 14 మ్యాచులు ఆడనుంది. ఇందులో ఏడు మ్యాచులు సొంత గడ్డపైనే ఆడుతుంది. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్లో ఆడబోతున్నాయి. క్వాలిఫైర్స్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచుల తేదీలు, వేదికలను బీసీసీఐ వెల్లడించలేదు.