అమల్లోకి కొత్త న్యాయచట్టాలు

అమల్లోకి కొత్త న్యాయచట్టాలు

న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్) చట్టాలను తీసుకువచ్చారు. ఈ క్రమంలో కొత్త చట్టాల కింద తొలి కేసు నమోదయింది. అది కూడా దేశ రాజధానిలోనే కావడం గమనార్హం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ వారికి కని పించాడు. దీంతో దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉన్నదని, దానిని తీసేయాలని ఆ వ్యాపారికి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినకపోవడంతో భారతీయ న్యాయ సంహిత క్రిమినల్ కోడ్లోని సెక్షన్ 285 ప్రకారం.. కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని బీహార్లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్గా గుర్తించారు. ఈ సెక్షన్ ప్రకారం.. రోడ్లను ఆక్రమించడం, తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. జరిమానా రూ.5 వేల వరకు ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos