విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో తెరకెక్కించనున్న తదుపరి చిత్రాన్ని సైతం విభిన్నంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట.అందుకోసం ఎర్రచందనం విరివిగా లభించే శేషాచలం అడవుల్లో చిత్రీకరణ జరపడానికి దర్శక నిర్మాతలు భావించారు.అయితే ఎంతగా ప్రయత్నించినా అక్కడి నుంచి అనుమతులు రాకపోవడంతో, ‘థాయ్ లాండ్‘ అడవుల్లో షూటింగ్ జరపాలనే నిర్ణయానికి సుకుమార్ వచ్చినట్టు సమాచారం. ఎర్రచందనం అక్రమ రవాణాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను థాయ్ లాండ్ అడవుల్లోనే చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో రఫ్ లుక్ తో బన్నీ కనిపించనున్నాడట.ఈ పాత్రలో చిత్తూరు యాసలో మాట్లాడతాడని అందుకోసం బన్నీ ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ను నియమించుకున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించనుండగా, ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.