ఆ ఛానెల్‌తో తీన్మార్ సావిత్రి వివాదం?

  • In Film
  • July 23, 2019
  • 140 Views
ఆ ఛానెల్‌తో తీన్మార్ సావిత్రి వివాదం?

 వివాదాలు,విమర్శలు,ఆరోపణల మధ్య ఆదివారం నుంచి బిగ్‌బాస్‌ తెలుగు మూడవ సీజర్‌ మొదలైన విషయం తెలిసిందే.మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన తీన్మార్‌ యాంకర్‌ శివజ్యోతి అలియాస్‌ సావిత్రి బిగ్‌బాస్‌ షో కోసం ఉద్యోగానికి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.దీంతో సదరు మీడియా ఛానెల్‌ సావిత్రిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.తీన్మార్‌ కార్యక్రమం ద్వారా సావిత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులరైన శివజ్యోతి ఇకపై ఎక్కడ కూడా తీన్మార్‌లో తాము పెట్టిన సావిత్రి పేరును వినియోగించుకోరాదంటూ షరతులు విధించినట్లు సమాచారం.ఒకవేళ ఎక్కడైనా సావిత్రి పేరు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ శివజ్యోతిని హెచ్చరించినట్లు సమాచారం. అందుకే నిన్న జరిగిన బిగ్ బాస్ షో లో కూడా ఆమెని శివజ్యోతి అనే నాగార్జున పిలిచారు. ఎక్కడా తీన్మార్ ప్రస్తావన కానీ, సదరు ఛానల్ ప్రస్తావన కానీ తీసుకురాలేదని టాక్‌ వినిపిస్తోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos