ఒకటిన్నర శతబ్ద కాలంగా నలుగుతున్న అయోధ్య స్థలవివాదంపై శనివారం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించిన నేపథ్యంలో శ్రీరాముడికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.తాజాగా శ్రీరాముడు జన్మించిన సమయం,తేదీ తదితర వివరాల గురించి ఇనిస్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.శ్రీరాముడు జన్మించిన సమయంలో ఐదు గ్రహాలు ఉచ్ఛదశలో ఉన్నాయని, ఆయన చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడని వాల్మీకి మహర్షి, తన గ్రంథంలో చెప్పిన వివరాలతో పాటు, వనవాసానికి వెళ్లే సమయానికి రాముడికి 25 సంవత్సరాలని వెల్లడించిన విషయాలను సమగ్రంగా పరిశోధించి ఇనిస్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ (ఐ సర్వ్), ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.హిందువులు పవిత్రంగా పూజించే శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5,114, జనవరి 10వ తేదీన అర్ధరాత్రి గం12.05 నిమిషాలకు జన్మించాడని తేల్చింది. సమయ నిర్ధారణ కోసం ప్లానిటోరియం అనే సాఫ్ట్ వేర్ ను వినియోగించామని పేర్కొంది. రామాయణం నిజంగానే జరిగిందని, భరత భూమిపైనే ఆయన జన్మించి, అయోధ్య పురవీధుల్లో తిరిగారని స్పష్టం చేసింది.