నయనతార పడిలేచిన కెరటం..

  • In Film
  • July 6, 2019
  • 144 Views
నయనతార పడిలేచిన కెరటం..

సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు వచ్చినా వాటిని అధిగమిస్తూ ప్రస్తుతం దక్షిణాదిలో లేడీసూపర్‌ స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.వ్యక్తిగత జీవితంలో నయనతార ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి, నయనతార జీవితంలోని పలు ఆసక్తికర విషయాల గురించి సినీ విశ్లేషకుడు ఇమంది రామారావు ఓ ఇంటర్‌వ్యూలో వెల్లడించారు.కేరళలో పుట్టిన నయనతార చిన్నప్పటి నుంచే చాలా డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ ఉండేదని చిన్నప్పటి నుంచి తన ఇష్టప్రకారం నడుచుకోవడానికే మొగ్గు చూపేదని తల్లితండ్రుల మాట అసలు లెక్క చేసేది కాదని తెలిపారు.నయనతార స్వతహాగా క్రిస్టియన్‌ అయినప్పటికీ హిందూ మతంపై చిన్నప్పటి నుంచి ఆసక్తి పెంచుకుందని తెలిపారు.సినిమాల్లోకి ప్రవేశించాక శింబుతో ప్రేమలో పడ్డ నయనతార శింబును చాలా ఎక్కువగా ప్రేమించిందని అయితే వల్లభ సినిమాలో శింబుతో శృతి మించి రొమాన్స్‌ చేయడంతో నయనతారతో శింబు పెళ్లికి శింబు తండ్రి రాజేంద్రన్‌ అంగీకరించలేదన్నారు. ఇలా లిప్ లాక్ సీన్లు చేసిందంటే ఆమెకు పెద్దలు అంటే భయం, భక్తి లేదు అందుకే నీతో అలాంటి సీన్లు ఓపెన్ గా చేసింది. నాకైతే పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాడు. అందుకే అప్పట్లో నయన్‌,శింబు పెళ్లి జరుగలేదని రామారావు తెలిపారు.ఇది జరిగిన కొద్ది కాలానికి నయనతార దర్శకుడు,నటుడు ప్రభుదేవాతో ప్రేమలో పడిందని ఈ ప్రేమ వ్యవహారం నయనతారను చాలా దూరం తీసుకెళ్లిందని తెలిపారు.ప్రభుదేవాను నయనతారా చాలా అమితంగా ప్రేమించిందని ప్రభుదేవా కోసం ఏం వదులుకోవడానికి సిద్ధపడిందన్నారు.శ్రీరామరాజ్యం అనంతరం సినిమాలకు స్వస్తి పలకడానికి నిర్ణయించుకుందని అందుకు కారణం అపుడు ప్రభుదేవాతో పెళ్లికి సిద్ధం అవ్వడమేనన్నారు. పెళ్లికి ముందు ప్రభుదేవా అన్ని షరతులను నయనతార అంగీకరించిందని తన ఆస్తులు కూడా కైవశం చేసిందన్నారు. అయితే ప్రభుదేవా భార్య లత.. ఆ సమయంలో చాలా పెద్ద గొడవ చేసిందని నా భర్తను ఇంకొకరి భర్తగా చేసే అవకాశం ఇవ్వనని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ భీష్మించుకుని కూర్చోవడం ఈ విషయం మద్రాసులో అందరికీ తెలిసిపోవడంతో పెద్ద గొడవైందని రామారావు తెలిపారు. చేసేది లేక నయనతార ప్రభుదేవాను మరిచిపోయింది. ప్రభుదేవాకు అప్పట్లో నయనతార చాలా ఆస్తులు ఇచ్చింది. అవి తిరిగి వచ్చాయో లేదో తెలియదు. జీవితంలో అంత డిస్ట్రబ్ అయిన తర్వాత ఎవరూ కోలుకోలేరు. కానీ నయనతార మాత్రం మునుపటి కంటె రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసి సూపర్‌స్టార్‌గా ఎదిగిందన్నారు.ప్రస్తుతం విఘ్నేష్ శివన్ అనే దర్శకుడితో నయనతార కలిసి ఉంటున్నారు. ఇప్పటికీ కూడా విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు. సెక్స్ అనేది ఇష్టపడి చేసుకునే తప్ప అది బాండింగ్ కాదు అని నమ్మే వ్యక్తి ఆమె. ఎవరికీ ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వను అనే భావనతో ఉండేవారు. నా మనసు కోరుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అనే అభిప్రాయంలో ఉండేవారని రామారావు తెలిపారు.

 

 

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos