ఎవరీ డైసీ?

  • In Film
  • March 15, 2019
  • 132 Views
ఎవరీ డైసీ?

ఒకేఒక్క ప్రెస్‌మీట్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై వస్తున్న ఊహాగాలన్నింటికి సమాధానం చెప్పడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి సంబంధించి ఏదైనా కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు కొత్త వెతుకులాటలు షురూ చేశారు.ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో తారక్‌కు జోడీగా నటించనున్న విదేశీకథానాయిక డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ గురించి అంతర్జాలంలో వెదులాట ప్రారంభించారు.ఈ క్రమంలో డైసీకి సంబంధించి మన నెటిజన్లు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. అవేంటంటే..లండన్‌లో పుట్టిపెరిగిన డైసీకి చదవులు బుర్రకెక్కకపోవడంతో చదువులకు స్వస్తి చెప్పి ఐదేళ్ల ఏళ్ల వయసుకే నటించడం మొదలుపెట్టింది.అలా 14వ ఏట అడుగు పెట్టగానే లండన్‌లో అతితక్కువ మందికి నటీనటులకు లభించే నేషనల్‌ యూత్‌ థియేటర్‌లో అవకాశం దక్కించుకుంది.2018లో వచ్చిన పాండ్‌లైఫ్‌ చిత్రంలో కాషీ పాత్ర ద్వారా డైసీ గుర్తింపు తెచ్చుకుంది.అంతకుముందు కోల్డ్‌ఫీట్‌,వార్‌ ఆఫ్‌ది వాల్డ్స్‌,జెంటిల్‌మాన్‌ జాక్‌,సైలెంట్‌ విట్‌నెస్‌,ఔట్‌ నంబర్డ్‌ తదితర వెబ్‌సిరీస్‌లలో నటించింది.తారక్‌,చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించనున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రంపై దేశవ్యాప్తంగా హైప్‌ ఉండడంతో పదికిపైగా భాషల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం విడుదల కానుండడంతో ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా నటించనున్న డైసీ ఇండియన్‌ సినిమాల్లో బిజీ తారగా వెలుగుతుందని సినీవర్గాలు చర్చించుకుంటున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos