పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో..

పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో..

పరీక్షలు సరిగా
రాయలేదని మనస్తాపం చెంది ఇంటర్‌ విద్యార్థి గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.సూర్యపేట
జిల్లా కేంద్రంలో ప్రగతి జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న జిల్లాలోని కాసర్లకు
చెందిన తరుణ్‌కుమార్‌ మార్చ్‌13 పరీక్షకు సిద్ధమవుతున్నాడు.అయితే ముందు రాసిన పరీక్షలు
సరిగా రాయలేదని పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో తరుణ్‌ కొద్ది రోజులుగా దిగులుగా
ఉంటున్నాడు.ఈ విషయం తల్లితండ్రులకు చెబితే తిడతారనే భయంతో ఏంచెచయ్యాలో పాలుపోని తరుణ్‌
సోమవారం రాత్రి పట్టణంలోని పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద బ్లేడుతో గొంతుకోసుకొని ఆత్మహత్యకు
యత్నించాడు.మంగళవారం ఉదయం తరుణ్‌ అచేతనస్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే
పోలీసులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు వివరాలు సేకరించారు.మొదట
తనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పిన తరుణ్‌పై పోలీసులు అనుమానం
వ్యక్తం చేసి మరోసారి గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు.పరీక్షల్లో ఫెయిల్‌
అవుతాననే భయంతో తానే గొంతు కోసుకున్నానని అంగీకరించాడు.దీంతో పోలీసులు యువకుడికి కౌన్సలింగ్‌
ఇచ్చి ఇంటికి పంపించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos