బీమా సొమ్ము కోసం చేతినే నరుక్కుంది…!

  • In Crime
  • March 13, 2019
  • 158 Views
బీమా సొమ్ము కోసం చేతినే నరుక్కుంది…!

బీమా కోసం ఓ మహిళ ఏకంగా తన చేతినే నరుక్కుంది. తద్వారా రూ.3 కోట్లకు పైగా బీమా సొమ్మును కొట్టేయాలని చూసింది. ఐరోపా దేశం స్లొవేనియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె తన చేతిని నరుక్కున్న వెంటనే బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇంటి ముందున్న చెట్టు కొమ్మలను నరికివేసే ప్రయత్నంలో పొరబాటున చెయ్యి తెగిందని బంధువులు వైద్యులకు తెలిపారు. శాశ్వత వైకల్యం వల్ల బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా ఆమె తెగిన చెయ్యిని ఇంటి వద్దే వదిలేసి వచ్చింది. ఈ విషయంలో బంధువులు కూడా ఆమెకు సహకరించారు. అయితే వైద్య సిబ్బంది సకాలంలో ఆమె తెగిన చేతిని తీసుకు రావడంతో, ఆ భాగాన్ని ఆమెకు అతికించారు. బీమా మోసం కింద ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నాలుగు లక్షల యూరోలకు (రూ.3.14 కోట్లు) ఆమె బీమా చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos