అమరావతి: భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సిట్ తదుపరి చర్యలను నిలిపేస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం నియమించింది. దీన్నితెదేపా నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు న్యాయస్థానంలో సవాలు చేసారు. దురుద్దేశంతో, ప్రణాళిక ప్రకారం ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదని కక్షిదారు తరపు న్యాయవాది వాదించారు. దరిమిలా సిట్ తదుపరి చర్యలు ఆపేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.