అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుదేదేశం ప్రభుత్వం దుబార ఖర్చులు
చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తోందంటూ వినిపిస్తున్న ఆరోపణలు కొనసాగుతూనే
ఉన్నాయి.తాజాగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్
భవన్ వద్ద చేపట్టిన ధర్మపోరాట దీక్షకు అక్షరాలు రూ.11 కోట్లు ఖర్చు చేసారంటూ జాతీయ
మీడియా కోడై కూసింది.అయినా సీఎం చంద్రబాబు ఈ వార్తలను తేలికగా తీసుకున్నారు.తాజాగా
ఇటువంటిదే మరో ఆరోపణ చంద్రబాబు ప్రభుత్వంపై వినిపిస్తోంది.ఈసారి తన కుమారుడు,మంత్రి
నారా లోకేశ్‌ను సన్మానించడానికి రూ.2.5 కోట్లను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడానికి
ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వినిస్తున్నాయి.అది కూడా ప్రభుత్వ ఖజానా నుంచే.గత నాలుగున్నరేళ్ల కాలంలో ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారంటూ సంబంధిత ఉద్యోగులందరినీ సమావేశపరిచి బుధవారం మంత్రి లోకేష్ ను సన్మానించబోతున్నారు. ఉద్యోగులందరూ కృతజ్ఞతగా మంత్రికి సన్మానం చేస్తున్నారని పైకి చెబుతున్నా.. ఆ ఉద్యోగులందరినీ విజయవాడకు తరలించేందుకు – సన్మాన సభకు అయ్యే ఖర్చు కోసం దాదాపు రూ. 2.5కోట్లను ఉపాధి హామీ నిధుల నుంచి వెచ్చించాలని మంత్రి లోకేష్ కార్యాలయం సూచించినట్లు
సమాచారం.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లతో పాటు మండల – జిల్లా స్థాయిలో పనిచేసే దాదాపు 15 వేల మందిని తరలించేందుకు ఉపాధి నిధులతో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారని
తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సన్మానం కాగా.. బుధవారం ఉదయమంతా వారిని రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూపించేలా విహార యాత్రలు ఏర్పాటు చేశారు. విహార యాత్ర అనంతరం ఉద్యోగులంతా సన్మాన కార్యక్రమానికి హాజరై ‘థ్యాంక్యూ లోకేష్ గారూ!’ అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయాలంటూ
నేతలు కట్టుదిట్టమైన సూచనలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… లోకేష్ సన్మాన కార్యక్రమానికి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా పాల్గొనాలని – ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల పెంపుపై మంత్రి ప్రకటన చేస్తారని అధికారులు ఆశ పెట్టారు. దీంతో ఇష్టమున్నా లేకున్నా అంతా బయల్దేరి వస్తున్నారు..