రైతుల ఖాతాల్లోకి తుపాను నష్టపరిహారం

రైతుల ఖాతాల్లోకి తుపాను నష్టపరిహారం

అమరావతి: నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. రూ. 601.66 కోట్ల రూపాయల మేర ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపునకు అనుమతులు జారీ చేసింది. శ్రీకాకుళం మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని 7 లక్షల 82 వేల 649 మంది రైతులకు నష్టం వాటిల్లినట్టు స్పష్టం చేసింది. మొత్తంగా 4 లక్షల 59 వేల 608 హెక్టార్లలోని పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఉద్యాన పంటలు నష్ట పోయిన రైతులకు 44.33 కోట్ల రూపాయల మేర ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. నివర్ తుపాను కారణంగా కడప, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో 26, 731 హెక్టార్లలోని ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు తెలిపింది. మొత్తం 51, 527 మంది ఉద్యాన రైతులకు 44.33 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించనుంది. పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి నేరుగా ఈ మొత్తాన్ని వేయాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos