న్యూఢిల్లీ : దేశంలో జననాల రేటు తగ్గినట్లు సర్వే తెలిపింది. భారతదేశ జనన రేటు (సిబిఆర్) జనాభాలో ప్రతి వెయ్యిమందికి ఒక ఏడాదిలో జన్మించే చిన్నారుల సంఖ్యను సిబిఆర్‌గా లెక్కిస్తారు. 2022లో 19.1శాతం ఉండగా, 2023లో 18.4కి పడిపోయింది. 2022తో పోలిస్లే ఏడు పాయింట్లు తగ్గినట్లు తాజా శాంపిల్ రిజిస్ట్రేషన్ స్టాటిస్టికల్ సర్వే తెలిపింది. దేశంలోని మొత్తం సంతానోత్పత్తి రేటు (టిఎఫ్‌ఆర్) రెండేళ్లలో మొదటిసారి 2023లో 1.9కి పడిపోయింది. 2021, 2022లో భారతదేశ టిఎఫ్‌ఆర్ 2.0 వద్ద స్థిరంగా ఉంది.ఈవారం భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బీహార్‌లో సిబిఆర్ అత్యధికంగా 25.8 గా, తమిళనాడులో అత్యల్పంగా 12గా ఉంది. పెద్ద రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీహార్ అత్యధిక టిఎఫ్‌ఆర్ (2.8)గా ఉండగా, ఢిల్లీలో అత్యల్పంగా 1.2గా నమోదైంది. 18రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 2.1 భర్తీస్థాయి టిఎఫ్‌ఆర్ కంటే తక్కువ టిఎఫ్‌ఆర్‌ను నివేదించాయని నివేదిక హైలెట్ చేసింది.దేశంలో ముడి మరణాల రేటు 2023లో 6.4గా ఉందని, ఇది 2022తో పోలిస్లే 0.4పాయింట్ల తగ్గుదల అని నివేదిక పేర్కొంది. 2020-2022 మరియు 2021-2023 మధ్య కాలంలో శిశు మరణాల రేటు జాతీయ స్థాయిలో 1పాయింట్ తగ్గింది.నాలుగేళ్లు ఆలస్యంగా ఈ ఏడాది మేలో 2021 ఏడాదికి సంబంధించి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్‌ఎస్), నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్), మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ (ఎంసిసిడి) నివేదికలను ఆర్‌జిఐ విడుదల చేసింది. జూన్‌లో 2022కి సంబంధించి ఎస్‌ఆర్‌ఎస్, సిఎస్‌ఆర్, ఎంసిసిడి డేటాను విడుదల చేసింది. 2023కి సంబంధించి ఎస్‌ఆర్‌ఎస్ నివేదికను వెల్లడించినప్పటికీ, సిఆర్‌ఎస్, ఎంసిసిడి డేటాలను వెబ్‌సైట్‌లో పొందుపరచలేదు.ఎస్‌ఆర్‌ఎస్ 2023 నివేదిక ప్రకారం.. దేశంలో వృద్ధుల నిష్పత్తి (60 ఏళ్లు పైబడిన వారు) ఒక సంవత్సరంలో 0.7 శాతం పాయింట్లు పెరిగి జనాభాలో 9.7శాతానికి చేరుకుంది. కేరళలో వృద్ధుల జనాభా 15శాతం ఉండగా, అత్యల్పంగా అస్సాం (7.6శాతం), ఢిల్లీ (7.7శాతం), జార్ఖండ్ (7.6శాతం ) ఉన్నట్లు నివేదిక తెలిపింది.