వాషింగ్టన్: ఇన్ఫోసిస్ సంస్థ అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది. వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇన్ఫోసిస్కు ఎనిమిది లక్షల డాలర్ల (సుమారు రూ.56 కోట్లు) జరిమానా విధించినట్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెకెరా బుధ వారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్ఫోసిస్ సంస్థ పొరుగు సేవల నిర్వ హణలో వీసా నిబంధనల్ని అతిక్రమిస్తోందని ఫిర్యాదులు దాఖల య్యాయి. సంస్థపై అమెరికాలో అనేక ఆంక్షలు ఉండడంతో 2006-2017 మధ్య భారత్ నుంచి తన ఉద్యోగుల్ని బిజినెస్ వీసాలతో కాలి ఫోర్నియాకు బదిలీ చేసిందని ఫిర్యాదులో ఆరోపించారు. దరిమిలా వివిధ రకాల పన్నులు ఎగ్గొట్టిన్నట్లు విమర్శించారు. ఒక మాజీ ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు దీనిపై విచారణ చేపట్టారు.దీంతో కాలిఫోర్నియా ప్రభుత్వంతో నవంబరులో ఇన్ఫోసిస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ వివరాలు మంగళవారమే బయటకు వచ్చాయి. 2017లోనూ ఇదే తరహా ఆరోపణల కింద న్యూయార్క్ ప్రభుత్వానికి ఒక మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఇన్ఫోసిస్ అంగీకరించింది.