న్యూఢిల్లీ: ‘మా నానమ్మ ఉక్కుమహిళ’అని కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత రాహుల్ గాంధీ మంగళవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంత్యత్సువ సందర్భంగా ఆమెను కొనియాడాడు. ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు ఆమెకు నివాళులర్పించారు. ‘శక్తిమంతమైన, సమర్థమైన నాయకురాలు, భారత్ను దృఢమైన దేశంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ఉక్కు మహిళ , మా ప్రియతమ నానమ్మ ఇందిరాగాంధీ. జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇందిరాగాంధీ స్మారక స్థలం -శక్తి స్థల్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించి పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు.