పుణె: విమానంలోని బొద్దింకను తొలగించేందుకు ప్రయాణికులు చేసిన ఫిర్యాదును సిబ్బంది పెడచెవిన పెట్టిన ఇండిగో విమాన సంస్థకు వినియోగదారు వేదిక రూ.50 వేలు జరిమానా విధించింది. రెండేళ్ల కిందట అసీమ్, సురభి భరద్వాజ్ ఇండిగో విమా నంలో ఢిల్లీ నుంచి పుణే వెళ్లారు. తమ సీటు కింద ఉన్న బొద్దింక ను తొలగించాలని విమాన సిబ్బందికి తెలిపారు. సిబ్బంది తాత్సారం చేసారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నా సిబ్బంది పట్టించుకో లేదు. ‘చేసుకోండి.. ఫిర్యాదు’అని మరింత నిర్లక్ష్యం ప్రదర్శించారు. దరిమిలా వారు బొద్దింకను ఫొటో తీసి ఇండిగో అధికారులకు ఫిర్యాదు చేసారు. వారి ప్రవర్తనా ఇతర సిబ్బంది కంటే భిన్నంగా లేదు. దీంతో వారు అనివార్యంగా వినియోగదారుల వేదికకు ఫిర్యాదు చేసారు. రూ.50 వేలు నష్ట పరి హారంతోపాటు వారి టికెట్ చార్జీకి వడ్డీ కలిపి ఫిర్యాదు దార్లకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు వినియోగదారుల వేదిక ఇండిగో సంస్థకు తాఖీదుల్ని పంపినా అధికారులు స్పందించ లేదు. పర్యవసానంతా న్యాయ మూర్తి ఇండిగో సంస్థకు జరినామా విధించారు.