యుద్ధాల్లోనే కాదు దౌత్యపరమైన అంశాల్లో కూడా అనేకసార్లు ఎదురుదెబ్బలు తిన్నా కూడా పాకిస్థాన్ తీరు మారడం లేదు.కుక్క తోక వంకరే అన్న చందాన తరచూ ఏదోఒక విషయంలో భారత్‌ను కవ్విస్తూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది.కొద్ది సంవత్సరాల క్రితం తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను అరెస్ట్ చేసి అనేక ఛీత్కారాలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ తాజాగా మరో భారతీయుడిని గూఢచర్యం నెపంతో అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.పాకిస్థాన్‌లో గూఢచర్యానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ రాజు లక్ష్మణ్ అనే భారతీయుడిని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోని రాఖీగజ్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పాక్ పోలీసులు వెల్లడించారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోకి ప్రవేశిస్తుండగా లక్ష్మణ్‌ను అరెస్ట్ చేశామని తానో గూఢచారినని రాజు లక్ష్మణ్ ఒప్పుకున్నాడని… అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు రాజుని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి..