ఆర్టికల్ 370 అనంతరం భారత్ను ఎలాగైనా దెబ్బ తీయాలని కుయుక్తులు పన్నుతున్న పాకిస్థాన్ కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో కలసి కాల్పులకు తెగబడుతోంది. తద్వారా భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పించడానికి ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ పోస్టులకు సమీపంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై తాజాగా భారత సైన్యం మెరుపుదాడులు నిర్వహించింది. గడిచిన కొద్ది రోజులుగా భారత సరిహద్దు గ్రామాలపై తరచూ మోర్టారు దాడులు.. కాల్పులకు తెగబడుతోంది పాక్ సైన్యం. కాల్పుల క్రమంలోనే ఉగ్రవాద స్థావరాలు వెలవటం.. అక్కడి వారిని వీలు చూసుకొని భారత్ లోకి ప్రవేశించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులతో రెండు దేశాల మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. లష్కరే తయిబాకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని సోపోర్ జిల్లాలో అరెస్ట్ చేశారు.