అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని మరోసారి కేంద్రం ఇక్కడి ఉన్నత న్యాయస్థానంలో గురువారం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంలో తేల్చి చెప్పింది. ‘రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదు. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టింది. హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేం. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అని’ తెలిపింది.