ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో సర్వే చేసిన కొన్ని జాతీయ మీడియా సంస్థలు వైసీపీ విజయం సాధించనుందంటూ తేల్చని విషయం విదితమే.తాజాగా ఇండియా టుడే సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది.గత ఏడాది సెప్టెంబర్ నెల నుంచి ఈ ఏడాది జనవరి వరకు ప్రజల అభిప్రాయాలు సేకరించిన ఇండియా టుడే అందులో ఈ ఆరు నెలల్లో జగనకు మద్దతు పలుతుకున్న ప్రజల సంఖ్య 43 నుంచి 45 శాతానిరి పెరగగా సీఎం చంద్రబాబుకు మద్దతు పలుకుతున్న ప్రజల సంఖ్య 38 నుంచి 36 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ఇక జనసేనాని పవన్ కు గతేడాది సెప్టెంబర్ లో 5శాతం ఏపీ ప్రజలు మద్దతు పలకగా.. ప్రస్తుత ఫిబ్రవరిలో మద్దతు 4శాతానికి పడిపోయింది. ఇతరులకు ప్రస్తుతానికి 15శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తమ సర్వేలో తేలినట్టు ఇండియా టుడే వివరించింది.2014 ఎన్నికల్లో అధికార టీడీపీ – ప్రతిపక్ష వైసీపీల మధ్య ఓట్ల శాతం తేడా అత్యల్పం. కానీ జగన్ ఈసారి తొమ్మిది శాతం లీడ్ లో ఉండడంతో ఏపీలో జగన్ గెలుపు లాంఛనమేనని ఇండియా టుడే అభిప్రాయపడింది.