చెన్నై టెస్టు : మెరుగైన స్థితిలో ఇండియా

  • In Sports
  • February 13, 2021
  • 153 Views
చెన్నై టెస్టు : మెరుగైన స్థితిలో ఇండియా

చెన్నై : ఇంగ్లండ్‌తో ఇక్కడి చెపాక్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ 33. అక్సర్‌ పటేల్‌ అయిదు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 161 పరుగులు చేయడంతో భారత్‌ పటిష్ట స్థితిలో ఉంది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే 67 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లీచ్‌, మొయిన్‌ రెండేసి వికెట్లు, స్టోన్‌, రూట్‌ తలో వికెట్టు తీశారు. కాగా తొలి టెస్టులో ఆడిన వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ను, నదీమ్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ను తీసుకున్నారు. జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌కు స్థానం లభించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos