న్యూఢిల్లీ : బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు వ్యతిరేకంగా సోమవారం పార్లమెంటు వెలుపల ఇండియా బ్లాక్ నేతలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎస్‌పి అధినేత అఖిలేష్ యాదవ్, అభిషేక్ బెనర్జీ, డిఎంకె నేత కనిమొళితో పాటు ఇతర ఇండియా బ్లాక్ ఎంపీలు పాల్గొన్నారు.కాగా, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టతనిచ్చింది. అయినప్పటకీ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులో ఎస్‌ఐఆర్‌పై చర్చ చేపట్టాలని నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు.