భారత్ ఇరాన్ మధ్య పెరుగుతున్న దూరం..

కొద్ది రోజులుగా దశాబ్దాలుగా నమ్మదగిన మిత్రులుగా ఉంటున్న పలు దేశాలు భారతదేశానికి కొద్ది కొద్దిగా దూరం జరుగుతున్నాయి.అందులో కొన్ని తటస్థంగా ఉంటుండగా మరి కొన్ని కొత్త శత్రువులుగా మారుతున్నాయి.కొద్ది కాలంగా భారత్ అమెరికాకు చాలా సన్నిహితంగా ఉంటుండడంతో ఈ పరిణామాలకు దారి తీశాయి.ఇప్పటికే నేపాల్ తో సహా చుట్టుపక్కనున్న అన్ని దేశాలు శత్రువులుగా మారగా తాజాగా ఇరాన్ సైతం భారత్ కు దూరమైంది.నాలుగేళ్ల క్రితం చాబహార్-జహేదాన్ మధ్య రైలు మార్గం వేయడానికి భారత్, ఇరాన్ ల మధ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 3,015 కోట్ల రూపాయల వ్యయంతో 2022 నాటికి భారత్ ఈ మార్గాన్ని నిర్మించాలనేది ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం. కానీ నిధులివ్వడంలో భారత్ జాప్యం చేస్తుండడం వల్లే తామే సొంతంగా నిర్మించుకుంటామని ఇరాన్ పేర్కొంది. ఆప్ఘానిస్థాన్ సరిహద్దును ఆనుకుంటూ వెళ్లే 628 కిలోమీటర్ల ఈ రైలు మార్గం అత్యంత కీలకమైంది. భవిష్యత్తులో ఈ మార్గాన్ని జరంజ్ కు విస్తరిస్తామని ఇరాన్ రవాణా మంత్రి మహమ్మద్ ఇస్లామీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్, చైనాల మధ్య 30 లక్షల కోట్ల రూపాయల ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి.దీని ప్రకారం వచ్చే 25 ఏళ్లలో ఈ మొత్తాన్ని ఇరాన్ లో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు చైనా ఖర్చు చేస్తుంది. చైనా రాకతోనే ఇరాన్, ఇండియాను పక్కన పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. చైనా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరితే డ్రాగన్ దేశ చాబహార్ పోర్టును ఎలాంటి పన్నులు కట్టకుండా వాడుకోవచ్చు. ఇక పోర్టు నిర్మాణంలోనూ చైనా కీలక పాత్ర పోషించనుందని సమాచారం. అయితే చాబహార్ పోర్ట్ నిర్మాణంలో చైనా పాత్ర ఉందనే వార్తలను ఇరాన్ అధికారులు ఖండిస్తున్నారు. కాగా చాబహార్ రైల్వే ప్రాజెక్టును కోల్పోవడం భారత్ కు దౌత్యపరంగా పెద్ద దెబ్బ అని నిపుణులు పేర్కొంటున్నారు.చైనా, ఇరాన్‌ల మ‌ధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని భార‌త్‌కు ఎదురుదెబ్బ‌గా నిపుణులు అభివ‌ర్ణిస్తున్నారు.అమెరికా ఆంక్ష‌లతో ఇరాన్ నుంచి చ‌మురు దిగుమ‌తుల‌ను భార‌త్ పూర్తిగా నిలిపివేసింది. ఇదివ‌ర‌కు భార‌త్‌కు ఇరాన్ ప్ర‌ధాన‌మైన చ‌మురు ఎగుమ‌తిదారు.అంతేకాదు ఇరాన్‌లో చైనా పెట్టుబ‌డులతో భార‌త్‌కు న‌ష్టం సంభ‌వించే అవ‌కాశముంది. ఇరాన్‌లో చాబ‌హార్ పోర్టును భార‌త్ నిర్మిస్తోంది. దీన్ని పాకిస్తాన్‌లో చైనా నిర్మిస్తున్న గ్వాద‌ర్ పోర్టుకు పోటీగా భార‌త్ ప్ర‌తిపాదించింది. ఇది భార‌త్‌కు వ్యూహాత్మ‌కంగా, వాణిజ్యప‌రంగా చాలా ముఖ్య‌మైన‌ది. ఇరాన్‌లో చైనా పెట్టుబ‌డులు పెర‌గ‌డంతో భార‌త్ పెట్టుబ‌డుల‌కు అవ‌రోధాలు ఏర్పడే అవ‌కాశ‌ముంది.స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు భార‌త్ విదేశాంగ విధానం వ్యూహాత్మ‌కంగా, స్వ‌తంత్రంగా ఉంది. అంటే భార‌త్ ఏ దేశాల శిబిరాల్లోనూ చేర‌లేదు. అదే స‌మ‌యంలో ఎవ‌రి ఒత్తిడికీ త‌లొగ్గ‌లేదు. త‌మ ప్ర‌యోజ‌నాలు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగానే అన్ని దేశాల‌తోనూ స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌ను పెట్టుకొనేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా భార‌త్ విదేశాంగ విధానం కాస్త బ‌ల‌హీన ప‌డిన‌ట్లు అనిపిస్తోంది. అమెరికా ప్ర‌భావం భార‌త్‌పై చాలా ఉంద‌ని పొరుగునున్న దేశాలు కూడా భావిస్తున్నాయి” అని ఇరాన్ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది..కొద్ది రోజులు క్రితం ఢిల్లీలో జరిగిన ఘర్షణలకు సంబంధించి భరత్ లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముస్లిం దేశాలు భరత్ కు వ్యతిరేకంగా ఏకమవుతాయని హెచ్చరించింది.ఈ తరుణంలో చైనా ఇరాన్ దగ్గరవుతుండడం ఇరాన్ లో చైనా పెట్టుబడులు పెడుతుండడం భారత్ కు ప్రతికూలంగా మారనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos