ఆఖరి వన్డేలో ఉత్కంఠభరిత గెలుపు

  • In Sports
  • October 14, 2019
  • 225 Views
ఆఖరి వన్డేలో ఉత్కంఠభరిత గెలుపు

వడోదర : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును శిఖా పాండే (35)తో కలిసి హర్మన్ ప్రీత్ (38) ఆదుకుంది. వీరిద్దరు ఏడో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజన్నె (3/20), ఇస్మాయిల్ (2/18), ఖాకా (2/33) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సఫారీ సేన భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా జట్టులో మరిజన్నె (29), సునే (24) మాత్రమే ఓ మోస్తరుగా ఆడగలిగారు భారత బౌలర్లలో ఏక్తా మూడు, దీప్తి శర్మ, రాజేశ్వరి చెరో రెండు, జోషి, జెమినా, హర్మన్‌ప్రీత్‌ తలో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఏక్తా నిలవగా మరిజన్నెప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos