ఇళయదళపతికి ఐటీ సమన్లు..

  • In Film
  • February 10, 2020
  • 168 Views
ఇళయదళపతికి ఐటీ సమన్లు..

తమిళ స్టార్‌ హీరో్ విజయ్‌తో పాటు బిగిల్‌ చిత్ర నిర్మాత కల్పాతి అఘోరం ఇళ్లు,కార్యాలయాలపై ఐటీ దాడులు తమిళ చిత్రపరిశ్రమలో సంచలనం,వివాదాలు సృష్టించాయి.ఐటీ దాడుల్లో నిర్మాత కల్పాతి వందల కోట్లు నల్లధనం దాచి ఉంచినట్లు గుర్తించగా హీరో విజయ్‌ రూ.100 కోట్లకు పైగా పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించారని వార్తలు వినిపిస్తున్నాయి.ఐటీ దాడుల్లో రూ.77 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు పన్నును ఎగ్గొట్టారన్న ఆరోపణలపై ఆయనకు సమన్లు జారీ చేశారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ నిర్మాత అన్బు చెజియాన్పన్ను ఎగవేత కేసులోనూ విజయ్జోక్యం ఉన్నట్లు పేర్కొన్నారు. విషయంపైనే తమకు సమాధానం చెప్పాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.కాగా, హీరో విజయ్నటించిన మెర్శల్చిత్రంలో పలు అంశాలు బీజేపీని టార్గెట్చేసినట్లు ఉన్నాయని అప్పట్లో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందించకపోవడం, జీఎస్టీ వసూళ్లు వంటి సన్నివేశాలు బీజేపీ నేతలను ఆగ్రహానికి గురి చేశాయి.ఈ కక్షతోనే బీజేపీ ఆదాయపన్ను శాఖతో దాడులు చేయిస్తోందని విమర్శలు వచ్చాయి.తాజాగా విజయ్‌కు సమన్లు జారీ చేయడం ద్వారా ఐటీ అధికారులు మరో అడుగు ముందుకేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos