అంగుళం భూమినీ పాక్‌కు వదలం

అంగుళం భూమినీ పాక్‌కు వదలం

న్యూఢిల్లీ: గిల్గిత్-బాల్టిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ హోదాను మార్చిన పాక్కు భారత్ను తప్పుబట్టే నైతికత లేదని కాంగ్రెస్ సీని యర్ నేత, పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ సోమ వారం వరుస ట్వీట్లలో వ్యాఖ్యానించారు. జమ్మూ-కశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితి మానహ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్తామని పాక్ ప్రకటించడాన్ని తప్పుపట్టారు. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం పాక్కు ఎంత మాత్రమూ లేదని చెప్పా రు. ‘మేము విపక్షంలో ఉన్నాం. ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాం. వెలుపల విషయానికి వస్తే మేమంతా ఒకటే. పాకిస్థాన్కు ఒక్క అంగుళం భూమి కూడా  మేము వదులుకునే ప్రసక్తే లేదు’ అని స్పష్టీకరించారు. చిరకాల రాజకీయ జీవితం ఆశించి తాను కాంగ్రెస్ పార్టీలోకి రాలేదని, సమ్మి ళిత, ప్రగతిశీల భారత్ సాధన కోసమే వచ్చాను. కేవలం సీట్ల కోసమో, ఓట్ల కోసమే సిద్ధాం తాలకు తిలోదకాలు ఇచ్చేది లేద’ని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos