హోసూరు : హోసూరు సమీపంలోని పెద్ద ఎలసగిరిలో రూ.7 లక్షల ఖర్చుతో ఆర్వో ప్లాంటును సోమవారం ప్రారంభించారు. హోసూరు యూనియన్ నల్లూరు పంచాయితీ పెద్ద ఎలసగిరి గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు.అందులో భాగంగా సోమవారం 7 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటును హోసూరు యూనియన్ చైర్ పర్సన్ శశి వెంకటస్వామి ప్రారంభించారు. పెద్ద ఎలసగిరి గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటిని అందుంచేందుకు ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేసినట్లు శశి వెంకటస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లూరు పంచాయితీ అధ్యక్షురాలు సావిత్రి మల్లేష్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్ రవికుమార్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.