న్యూఢిల్లీ : భాజపా ఢిల్లీ నేతలు వివక్ష, పక్షపాత వైఖరి అవలంభి స్తున్నారని భాజపా ఉపాధ్యక్షురాలు షజియా ఇల్మి బుధ వారం ఇక్కడ ఆరోపించారు. ‘ఢిల్లీ భాజపా నేతల తీరుతోనే నాకు అభ్యంతరాలున్నాయి. పార్టీ సీనియర్ నేతలు, అధిష్ఠానం దీని గురించి ఆలోచించాల’ని కోరారు. ఢిల్లీ బీజేపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావడం ఇదే తొలిసారి కాదు. గత కొంతకాలంగా పార్టీ నేతల వైఖరి పట్ల షజియా ఇల్మీ మండిపడుతున్నారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన వేది క పైకి షజియాను అనుమతించనందుకు ఆమె ఆగ్రహంగా ఉన్నారు. ఆమెకు మినహాయించి ఇత ఢిల్లీ నేతలందరికీ ప్రధాన వే ది క వద్దకు అనుమతించారు.