వెల్లింగ్టన్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఇంటర్వ్యూలు కొత్త కాదు. ఎక్కడైనా తడుముకోకుండా మాట్లాడగలడు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఓ వ్యక్తి ఇంటర్వ్యూ అడిగితే నీకో దండం అంటూ పారిపోయాడు. ఈ మధ్య స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మ్యాచ్లు ముగిసిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ ఇంటర్వ్యూలు తీసుకుంటున్న సంగతి తెలుసు కదా. చాహల్ టీవీ పేరుతో ఈ ఇంటర్వ్యూలోను బీసీసీఐ కూడా తన ట్విటర్లో పోస్ట్ చేస్తున్నది. తన టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వమని చాహల్.. ధోనీని అడిగితే అతను పారిపోయాడు. న్యూజిలాండ్తో జరిగిన ఐదో వన్డే తర్వాత ధోనీ ముందు పరుగెత్తుతుండటం, అతని వెనుక చాహల్ పరుగెత్తడం టీవీల్లో కనిపించింది. ఓవైపు విజయ్ శంకర్తోపాటు పాండ్యా, కేదార్ జాదవ్ ట్రోఫీతో పోజులిస్తుండగా.. ఆ పక్క నుంచి ధోనీ పారిపోవడం కనిపిస్తుంది. ధోనీ ఇంటర్వ్యూ ఇవ్వకపోవడంతో స్టాండిన్ కెప్టెన్ రోహిత్ శర్మను పట్టుకున్నాడు చాహల్.