
అమరావతి : నిఘా విభాగం పోలీసు డైరెక్టర్ జనరల్
ఏబీ. వెంకటేశ్వర రావు బదిలీని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రద్దు చేసింది. నియమావళి ప్రకారం నిఘా విభాగం డైరెక్టర్ జనరల్ పదవి ఎన్నికల సంఘం పరిధిలోకి రానందున ఆయన బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు. కడప, శ్రీకాకుళం ఎస్పీల బదిలీలో మార్పుల్లేవు.