మహిళలంతా ఐకమత్యంగా
ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని మహిళలు ఇలాగే కలసికట్టుగా ఉంటే ప్రస్తుతం మహిళలు జరుపుకొంటున్న
మహిళా దినోత్సవం తరహాలో భవిష్యత్తులు పురుషులు పురుషుల దినోత్సవం జరుపుకొంటారంటూ ఎంపీ
కల్వకుంట్ల కవిత చమత్కరించారు.హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో చిన్న,మధ్య,సూక్ష్మ తరహా
ఉత్సాహిక పారిశ్రామికుల శిక్షణ కేంద్రంలో నిర్వహించిన జాతీయస్థాయి మహిళ సమావేశంలో కవిత
ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనతో పాటు తన కుటుంబం ఉన్నతస్థాయికి ఎదగాలని ప్రతీ మహిళ
కలలు కంటూ కలలను నిజం చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు అధిగమిస్తున్నారన్నారు.మహిళలను
అభివృద్ధి పథంలో నడిపించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళకు అన్ని విధాల సహాయ
సహకారాలు అందిస్తుందన్నారు. జాతీయస్థాయి మహిళ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించినందుకు
కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు..