తమదేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ భారత నావికదళం మాజీ అధికారి కులభూషన్ జాదవ్‌కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షకు సంబంధించి నేడు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది.తమ దేశంపై గూఢచర్యం నిర్వహించారని, ఉగ్రవాదాన్ని ప్రేరేపించారని ఆరోపణలు చేసింది పాకిస్థాన్ మిలిటరీ కోర్టు. ఈ మేరకు అభియోగాలు మోపి ఉరిశిక్ష కూడా విధించింది. దీనిని భారత్ ఖండించింది. పాకిస్థాన్ విధించిన ఉరిశిక్షను తప్పుపడుతూ 2017 మే నెలలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.తమ దేశానికి చెందిన నావికాదళం మాజీ అధికారి కులభూషణ్‌పై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ యధేచ్చగా ఉల్లంఘిస్తోందంటూ భారత్ ఆరోపించింది. భారత్ తరపున న్యాయస్థానంలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. 2016 మార్చ్ నెలలో ఇరాన్ నుంచి వ్యాపారం కోసం బలూచిస్థాన్‌కు వచ్చిన జాదవ్‌ను పాకిస్థాన్ మిలిటరీ అదుపులోకి తీసుకుంది.జాదవ్ కుటుంబం ఫిర్యాదుతో జాదవ్ కోసం గాలించగా ఇరాన్లో లేడని తెలుసుకున్న భారత్ జాదవ్ గురించి పాకిస్థాన్‌ను ప్రశ్నించింది.తోలుత తమ వద్ద లేడంటూ బుకాయించిన పాకిస్థాన్ తర్వాత తమ వద్దే ఉన్నాడని అంగీకరించింది. తమ దేశంపై నిఘా పెట్టారనే ఆరోపణలు మోపి .. మిలిటరీ కోర్టులో అభూత సాక్ష్యాలు ప్రవేశపెట్టింది.అనంతరం జాదవ్‌కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించడం ఆ తర్వాత జరిగిన ఉద్రిక్తతతో .. జాదవ్ తల్లి, భార్య .. 2017 డిసెంబర్ 25న జైలులో కలిసిన సంగతి తెలిసిందే.జాదవ్‌కు ఉరిశిక్షను విధిస్తూ పాక్ మిలిటరీ కోర్టు వెల్లడించిన తీర్పును ప్రశ్నిస్తూ 2017లో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వాదనలు విన్న కోర్టు ఈనెల 17వ తేదీ తీర్పు వెల్లడిస్తామంటూ చెప్పింది.ఈ నేపథ్యంలో భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు సీజేఏ అబ్దుల్ అహ్మద్ యూసుఫ్ నేతృత్వంలోని 10 మంది సభ్యులు గల ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. కోర్టు తీర్పుపై భారతదేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.కులభూషణ్ జాదవ్ నిరపరాధిగా తీర్పు వస్తుందని యావత్ దేశం నమ్మకంతో ఉంది..